వైయస్‌ జగన్‌ను కలిసిన మహిళా రైతులు

కర్నూలు: ఆరుగాలం కష్టించి పంటసాగు చేస్తే ప్రభుత్వం పంటకు గిట్టుబాటు ధర కల్పించడం లేదని రాతనలో మహిళా రైతులు వైయస్‌ జగన్‌కు తమ ఆవేదనను వ్యక్తం చేశారు. పత్తికొండ నియోజకవర్గంలో రాతన చేరుకున్న ప్రజా సంకల్పయాత్రకు మ హిళా రైతులు తరలివచ్చారు. ఈ సందర్భంగా జననేతను కలుసుకొని తమ బాధను చెప్పుకున్నారు. పత్తి పంటకు సరైన మద్దతు ధర లేదని వాపోయారు. ఈ మేరకు స్పందించిన వైయస్‌ జగన్‌ ఒక సంవత్సరంలో ప్రజల ప్రభుత్వం వస్తుందని, అధికారంలోకి వచ్చిన తరువాత రైతు పండించిన పంటలకు రేట్‌ కార్డులు అందజేస్తామన్నారు. అప్పటి వరకు ఎవరూ అధైర్యపడొద్దని, త్వరలో మంచి రోజులు వస్తాయని భరోసా ఇచ్చారు. 

తాజా వీడియోలు

Back to Top