వైయ‌స్ జ‌గ‌న్‌ను క‌లిసిన రైతులు

అనంత‌పురం: పంటల‌కు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నామని మార్తాడు మండ‌ల రైతులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని కలిసి తమ గోడు వెళ్లబోసుకున్నారు. ఆదివారం వైయ‌స్ జ‌గ‌న్ మార్తాడు నుంచి పాద‌యాత్ర‌ను ప్రారంభించ‌గా, ఈ సంద‌ర్భంగా రైతులు క‌లిశారు. క‌రువుతో అల్లాడుతున్నామ‌ని, ఆదుకోవాల‌ని కోరారు. ఈ సంద‌ర్భంగా వారికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పించారు. మ‌న ప్ర‌భుత్వం వ‌చ్చాక రైతుల‌కు ప్ర‌తి ఏటా రూ.12,500 పెట్టుబ‌డి కోసం అంద‌జేస్తామ‌ని, రూ.3 వేల కోట్ల‌తో ధ‌ర‌ల స్థిరీక‌ర‌ణ నిధి, రూ.4 వేల కోట్ల‌తో ప్ర‌కృతి వైఫ‌రీత్యాల నిధి ఏర్పాటు చేసి ఆదుకుంటామ‌న్నారు. ప్ర‌తి మండ‌ల కేంద్రంలో కోల్డు స్టోరేజీ,గిడ్డంగులు ఏర్పాటు చేస్తామ‌ని వైయ‌స్ జ‌గ‌న్ హామీ ఇచ్చారు. 

Back to Top