జననేతకు తమ గోడు చెప్పుకున్న రైతన్నలు

వైయస్‌ఆర్‌ జిల్లా:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని అన్నదాతలు కలిసి తమ గోడు వెల్లబోసుకున్నారు. సకాలంలో ప్రభుత్వం పంటలకు సాగునీరు అందించకపోవడంతో పంటలన్నీ దెబ్బతిన్నాయని చాపాడు రైతులు జననేతకు చెప్పుకున్నారు. ప్రజాసంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలిసిన రైతులు సుమారు రూ. 50 వేల ఎకరాల పంటను నష్టపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వచ్చి నాలుగేళ్లు కావొస్తున్నా.. ఇప్పటి వరకు రుణమాఫీ కూడా కాలేదని చెప్పారు. ఒక్క సంవత్సరంలో మన ప్రభుత్వం వస్తుందని, అప్పుడు పంటలకు సకాలంలో నీళ్లు ఇచ్చే విధంగా బ్రహ్మసాగరం ప్రాజెక్టును స్థిరీకరిస్తామని వైయస్‌ జగన్‌ రైతులకు హామీ ఇచ్చారు. జననేత హామీతో రైతులు హర్షం వ్యక్తం చేశారు.

Back to Top