వైయస్‌ జగన్‌ను కలిసిన వేరుశనగ రైతులు

చిత్తూరు: పండించిన పంటకు చంద్రబాబు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన వేరు శనగ రైతులు తమ సమస్యలను ఆయనకు చెప్పుకున్నారు. వేరుశనగకు గిట్టుబాటు ధర లేదని, సహకార నూనె కర్మాగారాన్ని మూసివేయించారని ఫిర్యాదు చేశారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తానని వైయస్‌ జగన్‌ రైతులకు హామీ ఇచ్చారు. 
 
Back to Top