చంద్రబాబు వస్తేనే రైతులకు నష్టం


మొబైల్‌ ప్యాడీ డ్రైయ్యర్‌తో ఎలాంటి ఉపయోగం లేదు
తూర్పు గోదావరి:చంద్రబాబు ఎప్పుడు ముఖ్యమంత్రి అయిన రైతులకు నష్టమే అని రైతు సంఘాల నాయకులు పేర్కొన్నారు.  మొబైల్‌ ప్యాడీ డ్రైయ్యర్‌ మిషన్‌తో ఎలాంటి ఉపయోగం లేదని రైతులు వైయస్‌ జగన్‌కు వివరించారు. శనివారం రైతులు వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సంరద్భంగా వారు మాట్లాడుతూ.. డయ్యార్‌ మిషన్‌ పనితీరు చంద్రబాబుకు, మంత్రులకు తెలియడం లేదన్నారు. రైతులకు 2014లో సబ్సిడీపై అందించారని, దీని వల్ల ఎలాంటి ఉపయోగం లేదన్నారు. పొలాలు  గట్టుకు చేరే విధంగా దీనిని డీజైన్‌ చేయలేదని చెప్పారు. దీని వల్ల రైతులకు నష్టమే కాని, లాభం లేదన్నారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ ..మరో ఏడాది ఓపిక పడితే రాజన్న రాజ్యం వస్తుందని భరోసా కల్పించారు.
 
Back to Top