వైయస్‌ జగన్‌ను కలిసిన మామిడి రైతులు

నూజివీడు: ప్రభుత్వం తమను పట్టించుకోవడం లేదని మామిడి రైతులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. మామిడి పంటకు ప్రసిద్ధి చెందిన నూజివీడు నియోజకవర్గం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందన్నారు. ఈదర చేరుకున్న వైయస్‌ జగన్ను మామిడి రైతులు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలను జననేతకు చెప్పుకున్నారు. మామిడి దిగుబడికి సరైన ధర కల్పించడం లేదని, రైతులకు ప్రభుత్వం నుంచి చేయూత లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నామన్నారు. 
Back to Top