వైయ‌స్ జగన్‌కు కలిసిన చెరుకు రైతులు


చిత్తూరు: ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైయ‌స్‌ జగన్ మోహ‌న్ రెడ్డిని గురువారం ఉదయం చెల్లూరు క్రాస్‌ వద్ద చెరుకు రైతులు కలిశారు. ఈ సందర్భంగా వారు తమ సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. చంద్ర‌బాబు ఎప్పుడు ముఖ్య‌మంత్రి అయినా కూడా జిల్లాలోని స‌హ‌కార చ‌క్కెర ఫ్యాక్ట‌రీలు మూత ప‌డుతున్నాయ‌ని తెలిపారు. న‌ల్లం బెల్లం త‌యారి చేయ‌కుండా ఆంక్ష‌లు విధించి త‌మ క‌డుపు కొడుతున్నార‌ని రైతులు ఆవేద‌న వ్య‌క్తం చేశారు. వారికి వైయ‌స్ జ‌గ‌న్ భ‌రోసా క‌ల్పించారు.
Back to Top