మహానేతకు మంచిపేరు వస్తుందని అధికార పార్టీ కుట్రలు

అనంతపురం: మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి చేపట్టిన హంద్రీనీవా ప్రాజెక్టు పూర్తి అయితే ఆయనకు మంచి పేరు వస్తుందని అధికార పార్టీలు కుట్రలు చేస్తున్నాయని అనంతపురం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా పలువురు రైతులు వైయస్‌ జగన్‌ను కలిసి తమ సమస్యలు వివరించారు.  మహానేత మరణాంతరం హంద్రీనీవాను పూర్తి చేయకుండా ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి, చంద్రబాబులు మోసం చేశారని రైతులు విమర్శించారు. రెయిన్‌గన్ల పేరుతో రైతులను దగా చేశారన్నారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలవదని చంద్రబాబు గ్రహించి డబ్బులో గెలిచేందుకు అవినీతికి తెర లేపారని రైతులు ఆరోపించారు. నాడు చంద్రబాబు పాలనలో రైతాంగం దుర్భరంగా మారడంతో యస్‌ఆర్‌ హయాంలో రైతుల దర్జాగా బతికారన్నారు. 
 
Back to Top