ధరల స్థిరీకరణ, జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తా

అనంతపురం: దళారుల మోసాలతో అప్పులపాలు అవుతున్నామని టమాటా రైతులు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌కు మొరపెట్టుకున్నారు. టమాట ధరల పతనంపై అన్నదాతలు రోడ్డెక్కి ఆందోళన చేపట్టారు. ఈ సందర్భంగా రైతులను కలుసుకున్న వైయస్‌ జగన్‌ వారి నిరసనకు మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా వారంతా జననేతకు వారి కష్టాలను చెప్పుకున్నారు. ఎవరూ అధైర్య పడొద్దని, అన్ని విధాలుగా రైతులకు అండగా ఉంటానన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ధరల స్థిరీకరణ, జ్యూస్‌ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. 
Back to Top