నిర్లక్ష్యానికి గురైవుతున్న మాజీ సైనికులు

ఏలూరు : తమ సమస్యల పరిష్కారంలో చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని మాజీ సైనికోద్యుగులు జననేత వద్ద
వాపోయారు. ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని మాజీ సైనికులు
కలుసుకున్నారు. సైన్యంలో పనిచేసిన వారికి, చనిపోయిన వారి కుటుంబాలకు ప్రభుత్వ
భూములను కేటాయిస్తూ దివంగత వైయస్ రాజశేఖరరెడ్డి హయాంలో ఇచ్చిన జీవోను గత నాలుగేదుళ్లుగా
పక్కకు పెట్టేశారని వారు ఫిర్యాదు చేశారు. అట్లాగే మాజీ సైనికుల పిల్లలకు విద్యా, ఉద్యోగ
అవకాశాల్లో రిజర్వేషన్లు,  రేషన్ కార్డులు తదితర అంశాలపై వారు
జననేతకు విజ్ఞాపన పత్రాన్ని సమర్పించారు. వీరి సమస్యల పరిష్కారానికి కృషి
చేస్తానంటూ ఈసందర్భంగా వైయస్ జగన్ భరోసా ఇచ్చారు. 


Back to Top