దద్దనాల ప్రాజెక్టుకు నీరివ్వాలి

 
మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
బనగానపల్లె:  వైయస్‌ జగన్‌ ఇక్కడికి రావడం శుభ సూచకం. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు మన జననేతకు వివరించాం. యాగంటిపల్లె మొదలుకొని పసుపుల వరకు దద్దనాల ప్రాజెక్టుకు హంద్రీనీవా నుంచి నీరు వస్తే గ్రామాలు సస్యశ్యామలం అవుతాయి. ఒకప్పుడు ఇతర ప్రాంతాల వారు పసుపుల గ్రామానికి  పనులకు వచ్చేవారు. ఇప్పుడు ఇక్కడి ప్రజలు వలసలు వెళ్తున్నారు. వలసలు నివారించాలంటే వైయస్‌ జగన్‌ సీఎం అయిన తరువాత దద్దనాల ప్రాజెక్టుకు నీరు ఇవ్వాలి. బనగానపల్లె మండలంలో ఎక్కువ శాతం మైనింగ్‌పై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. నియోజకవర్గ ప్రజలను ఆదుకోవాలని ఆయన కోరారు.
 
Back to Top