అన్నా..అండగా ఉంటామంటున్నారు

మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి
కర్నూలు: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి తలపెట్టిన ప్రజా సంకల్ప యాత్రకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తుందని మాజీ ఎమ్మెల్యే కాటసాని రామిరెడ్డి పేర్కొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చి అన్నా..మీకు అండగా ఉంటామని అడుగులో అడుగులు వేస్తున్నారని ఆయన తెలిపారు. బనగానపల్లె నియోజకవర్గంలో వైయస్‌ జగన్‌ దాదాపు 37 కిలోమీటర్లు పాదయాత్ర చేస్తారని తెలిపారు. పనులు పక్కనపెట్టి ప్రజలు రాజన్న బిడ్డ కోసం ఎదురు చూస్తున్నారని తెలిపారు. గతంలో దివంగత ముఖ్యమంత్రి వైయస్‌రాజశేఖరరెడ్డి పాదయాత్రలో ఇచ్చిన ప్రతి  ఒక్క హామీ నెరవేర్చారని ప్రజలు గుర్తు చేసుకుంటున్నారని తెలిపారు. మీరు ముఖ్యమంత్రి అయిన తరువాత అన్ని హామీలు నెరవేర్చాలని, తమ సమస్యలు వైయస్‌ జగన్‌కు చెప్పుకుంటున్నట్లు కాటసాని పేర్కొన్నారు. గతంలో చంద్రబాబు కూడా పాదయాత్ర చేశారని, మహానేత పాదయాత్రకు బాబు పాదయాత్రకు చాలా తేడా ఉందన్నారు. బాబు ఇచ్చిన ఏ  ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. చంద్రబాబు మోసగాడిగా మిగిలిపోయాడు. వైయస్‌ జగన్‌ మంచి సంకల్పంతో చేస్తున్న పాదయాత్రకు విశేష స్పందన లభిస్తుందన్నారు.
 
Back to Top