వైయస్‌ఆర్‌ కుటుంబానికి కృతజ్ఞుడిని

పశ్చిమగోదావరి: దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి తన కుటుంబానికి చేసిన మేలును శ్రీనివాసరావు మరువలేదు. తన కూతురును బతికించిన ఆ కుటుంబానికి ఎల్లవేళలా కృతజ్ఞుడిగా ఉంటానని చెబుతున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాలోకి ప్రజా సంకల్పయాత్ర ప్రవేశించడంతో వెంటనే తాళ్లూరి శ్రీనివాసరావు అక్కడ ప్రత్యక్షమయ్యాడు. ఏలూరు సత్రంపాడుకు చెందిన శ్రీనివాసరావు తన సైకిల్‌ను వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ జెండాలతో అలంకరించుకొని తన వంతు ప్రచారం నిర్వహిస్తుంటాడు. వైయస్‌ కుటుంబంతో ఏం లబ్ధి పొందావని అడిగితే.. నా కుమార్తె విజయకు కడుపులో కంతి రావడంతో విజయవాడలోని ఎన్‌ఆర్‌ఐ ఆస్పత్రిలో చేర్పించాను. లక్షల రూపాయలు ఖర్చు అయ్యే వైద్యానికి మహానేత వైయస్‌ఆర్‌ పెట్టిన ఆరోగ్యశ్రీతో ఉచితంగా జరిగి తన బిడ్డ బతికిందని, అందుకే ఆ కుటుంబం అంటే అంత అభిమానం అని బదులిస్తున్నాడు. 
Back to Top