ఐకేపీ అక్రమాలపై విచారణ జరిపించాలి

పశ్చిమ గోదావరి: ఐకేపీలో జరిగిన అక్రమాలపై విచారణ జరిపించాలని డ్వాక్రా సంఘాల సభ్యులు వైయస్‌ జగన్‌ను కోరారు. ప్రజా సంకల్ప యాత్రలో ఉన్న వైయస్‌ జగన్‌ను కత్తవపాడు వద్ద డ్వాక్రా సంఘాల మహిళలు కలిశారు. జన్మభూమి కమిటీ ఆగడాలపై వైయస్‌ జగన్‌కు డ్వాక్రా సంఘాల మహిళలు వినతిపత్రం అందజేశారు. ఐకేపీ ద్వారా వచ్చిన కమీషన్‌ను దోచేశారని వారు ఫిర్యాదు చేశారు. జన్మభూమి కమిటీ అరాచకాలు పెరిగిపోయాయని పేర్కొన్నారు. 


Back to Top