నాలుగేళ్ల తరువాత భృతి ఇవ్వడం ఎన్నికల స్టంట్‌

తూర్పుగోదావరి: నాలుగు సంవత్సరాల తరువాత నిరుద్యోగ భృతి ఇవ్వడం ఎన్నికల స్టంట్‌ అని నిరుద్యోగులు ధ్వజమెత్తారు. ఎన్నికలు దగ్గరపడుతున్న తరుణంలో భృతి ఇవ్వడం ఓటుకు నోటులా ఉందని ఆరోపించారు. తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో నిరుద్యోగులు వైయస్‌ఆర్‌ సీపీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ మేరకు సమస్యలు వైయస్‌ జగన్‌కు చెప్పుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ..  35 ఏళ్ల వారికి మాత్రమే నిరుద్యోగ భృతి ఏంటని వారు ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో రూ. 2 వేల భృతి ఇస్తానని హామీ ఇచ్చి ఇప్పుడు వెయ్యి రూపాయలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. నిరుద్యోగ భృతికి వయస్సు పరిమితి విధించడం దుర్మార్గమన్నారు. 35 ఏళ్లు దాటిన నిరుద్యోగులకు చంద్రబాబు వృద్ధాప్య పెన్షన్‌ ఇప్పించాలని డిమాండ్‌ చేవారు. నాలుగు సంవత్సరాల నుంచి నిరుద్యోగులకు ఇస్తామన్న భృతి మొత్తం కలిపి చంద్రబాబు ఒకొక్కరికి రూ. లక్షా బాకీ పడ్డారన్నారు. ఎన్నికలు దగ్గరపడుతున్నాయని ఓట్లు కొనుగోలు చేయడానికి భృతి ఇస్తున్నట్లుగా ఉందన్నారు. 
Back to Top