బాబు మాటలు నమ్మి మోసపోయాం

 కర్నూలు: ఎన్నికల సమయంలో ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ చేస్తామని చెప్పిన చంద్రబాబు మోసం చేశారని విద్యుత్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజా సంకల్పయాత్రలో వైయస్‌ జగన్‌ను కలుసుకొని వారి బాధను చెప్పుకున్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి నాలుగేళ్ల అవుతున్నా.. నేటికీ ఉద్యోగాలు రెగ్యులరైజ్‌ చేయలేదన్నారు. బాబు మాటలు నమ్మి మోసపోయామని, తమకు న్యాయం చేయాలని వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. ఈ మేరకు స్పందించిన వైయస్‌ జగన్‌ వైయస్‌ఆర్‌ సీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు. 
Back to Top