అన్నగా ముందుండి నడిపిస్తా

తూర్పుగోదావరి: దివ్యాంగులకు నేనున్నానంటూ.. వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారు. తూర్పుగోదావరి జిల్లా రామచంద్రాపురంలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని దివ్యాంగులు కలిశారు. ఎన్నో కష్టాలకు ఓర్చి ఉన్నత చదువులు చదువుకున్నా.. తమకు ఉద్యోగం ఇవ్వడం లేదని, కనీసం ప్రైవేట్‌ ఉద్యోగం కల్పించడంలోనూ ప్రభుత్వం విఫలమైందని దివ్యాంగులు వాపోయారు. ప్రభుత్వం ఇచ్చే పెన్షన్‌ సరిపోవడం లేదన్నారు. వారి సమస్యలు విన్న వైయస్‌ జగన్‌ నేనున్నానంటూ భరోసా ఇచ్చారు. జననేత ముఖ్యమంత్రి అయితేనే తమ బతుకులు బాగుపడతాయని దివ్యాంగులు పేర్కొన్నారు. 
Back to Top