76వ రోజు ప్రజా సంకల్ప యాత్ర షెడ్యూల్‌


నెల్లూరు: వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్ప యాత్ర 76వ రోజు షెడ్యూల్‌ ఖారారు చేశారు. బుధవారం ఉదయం నెల్లూరు జిల్లా వెంకటగిరి నియోజకవర్గంలో బస నుంచి వైయస్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభమవుతోంది. అక్కడి నుంచి ఉదయం 9 గంటలకు మలిచేడు వద్ద  సర్వేపల్లి నియోజకవర్గంలోకి పాదయాత్ర అడుగుపెడుతోంది. పొదలకూరు మండలం డేగపుడి, ఇంకుర్తి వరకు సాగుతోంది. మధ్యాహ్నం 12 గంటలకు భోజన విరామం. 2.45 గంటలకు వైయస్‌ జగన్‌ పాదయాత్ర పునఃప్రారంభమవుతుంది. అక్కడి నుంచి మ్రరిపల్లి, పొదలకూరు వరకు పాదయాత్ర సాగుతోంది. సాయంత్రం పొదలకూరు వద్ద బహిరంగ సభలో వైయస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.
 
Back to Top