ప్రజా సంకల్ప యాత్ర 12 వ రోజు షెడ్యూల్

ప్రజా సంకల్పయాత్ర లో భాగంగా ప్రతి పక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డి తన  12 వ  రోజు పాదయాత్రను ఆదివారం  బనగానపల్లె నియోజకవర్గంలో నిర్వహించనున్నారు. ఉదయం 8 గంటలకు సోదర దిన్నె నుంచి ప్రారంభమై ఆముదాల క్రాస్ మీదుగా గులాంనబీపేట-బొందల దిన్నె క్రాస్ వద్దకు అక్కడి నుంచి ఎల్లూరి కొత్తపేటకు చేరుకుంటుందని పార్టీ ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఒక ప్రకటనలో తెలిపారు. మధ్యాహ్నం నుంచి బనగానపల్లెలోకి ప్రవేశించి, సాయంత్రం బహిరంగ సభ లో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు.Back to Top