చంద్రబాబు చర్యతో రోడ్డున పడ్డాం

తూర్పుగోదావరి: చంద్రబాబు చర్యతో తాము రోడ్డున పడ్డామని డాక్యుమెంట్‌ రైటర్స్‌ ఆవేదన వ్యక్తం చేశారు. కాకినాడలో పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని డాక్యుమెంట్‌ రైటర్స్‌ కలిశారు. ఈ మేరకు తమ సమస్యలు చెప్పుకున్నారు. పూర్వం లైసెన్స్‌ వ్యవస్థ ఉండేదని, చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తరువాత తీసేశారని, దీంతో డాక్యుమెంట్‌ రైటర్స్‌ వ్యవస్థ కుక్కలు చించిన విస్తరిలా తయారైందని వాపోయారు. తమ లైసెన్స్‌లు పునరుద్ధరించాలని వైయస్‌ జగన్‌ కోరారు. 
 
Back to Top