వైయస్‌ జగన్‌ను కలిసిన కాంట్రాక్టు లెక్చరర్స్‌


పశ్చిమ గోదావరి: కాంట్రాక్టు కార్మికులకు ఉద్యోగ భద్రత కల్పిస్తానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా కాంట్రాక్టు లెక్చరర్స్‌ వైయస్‌ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా తమకు వేతనాలు సక్రమంగా అందడం లేదని, ఉద్యోగ భద్రత లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి యనమల రామకృష్ణుడు ప్రతిసారి ఉమాభారతి కేసు అడ్డుఉందని తప్పించుకుంటున్నారని వైయస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యలు విన్న జగన్‌ ..ఏడాది ఓపిక పడితే వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వంవస్తుందని, అందర్ని రెగ్యులర్‌ చేస్తానని హామీ ఇచ్చారు. 
 
Back to Top