చెన్నారెడ్డి కుటుంబానికి వైయస్‌ జగన్‌ పరామర్శ

అనంతపురం: ఇటీవల హత్యకు గురైన వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ నేత చెన్నారెడ్డి కుటుంబ సభ్యులను వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి పరామర్శించారు. ప్రజా సంకల్ప యాత్రలో భాగంగా ధర్మవరం మండలం బడన్నపల్లెకు చేరుకున్న ప్రతిపక్ష నేత చెన్నారెడ్డి ఇంటికి వెళ్లారు. చెన్నారెడ్డి కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అండగా ఉంటానని వైయస్‌ జగన్‌ హామీ ఇచ్చారు.
 
Back to Top