బాబు పాలనలో అన్నీ ఇబ్బందులే..

కృష్ణా: చేనేత కార్మికుల సమస్యలు ప్రభుత్వానికి పట్టడం లేదని నేతన్నలు ఆవేదన వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లాలో ప్రజా సంకల్పయాత్ర పాదయాత్ర చేస్తున్న వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని చేనేతలు కలుసుకున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి పాలనలోనే తమ బతుకులు బాగున్నాయని, చంద్రబాబు కష్టాలు పడుతున్నామన్నారు. అదే విధంగా చంద్రబాబు కట్టిన పట్టిసీమ వల్ల ఒరిగిందేమీ లేదని రైతులు మండిపడ్డారు. సాగు, తాగునీరు లేక ఇబ్బందులు పడుతున్నామని తమ సమస్యను రైతులు జననేత దృష్టికి తీసుకొచ్చారు. 
Back to Top