పది నెలలు గడిచినా బీమా ఇవ్వరా?

అనంతపురం: రోడ్డు ప్రమాదంలో మనిషి చనిపోయి పది నెలలు గడుస్తున్నా.. ఇప్పటి వరకు చంద్రన్న బీమా ఇవ్వలేదంటే పరిపాలన ఏ విధంగా ఉందో ప్రజలే అర్థం చేసుకోవాలన్నారు. పెళ్లింట్లో విషాదం జరిగిందని పేపర్‌లో వచ్చిన కథనాన్ని ఆయన మీడియాకు చూపించారు. అనంతపురం జిల్లాకు చెందిన ఓ వ్యక్తి ఇప్పటి వరకు తమకు చంద్రన్న బీమా అందలేదని, పది నెలలుగా తిరుగుతూనే ఉన్నానని వైయస్‌ జగన్‌కు తన బాధను చెప్పుకున్నాడు. ఈ మేరకు వైయస్‌ జగన్‌ మీడియాతో మాట్లాడుతూ.. చనిపోయినట్లు ప్రభుత్వం ధ్రువపత్రం ఇచ్చినా బీమా ఇంకా ఇవ్వకుండా ప్రభుత్వం ఏం చేస్తుందని ప్రశ్నించారు. పబ్లిసిటీ పిచ్చితో ముందుకు పోవడం కాదు.. ప్రజా సమస్యలను పట్టించుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. 
Back to Top