జననేతకు చాదర్‌ బహూకరణ

గుంటూరు:

దశాబ్దాల ప్రతిష్ట గల గుంటూరు మస్తాన్‌ దర్గా ఉత్సవాలకు వచ్చిన ముస్లిం సోదరులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా గుంటూరు పాదయాత్ర చేస్తున్న వైయస్‌ జగన్‌ మస్తాన్‌ దర్గా వద్దకు చేరుకున్నారు. ఈ సందర్భంగా ముస్లింలు బాబుకు సమర్పించే చాదన్‌ను వైయస్‌ జగన్‌కు బహూకరించారు. కాబోయే ముఖ్యమంత్రి వైయస్‌ జగన్‌ను కలుసుకోవడం సంతోషంగా ఉందని వారంతా సంతోషం వ్యక్తం చేశారు. 

Back to Top