రేపు వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర‌కు విరామం

విశాఖ‌: ప‌్ర‌జా స‌మ‌స్య‌లు తెలుసుకునేందుకు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన ప్ర‌జా సంక‌ల్ప యాత్ర‌కు ఆగ‌స్టు 15వ తేదీన విరామం ప్ర‌క‌టించిన‌ట్లు వైయ‌స్ఆర్‌సీపీ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి త‌ల‌శీల ర‌ఘురాం తెలిపారు. ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌తిప‌క్ష నేత వైయ‌స్ జ‌గ‌న్ విశాఖ జిల్లాలో స్వాతంత్ర దిన వేడుక‌ల్లో పాల్గొంటార‌ని ఆయ‌న చెప్పారు. న‌ర్సీప‌ట్నం నియోజ‌క‌వ‌ర్గంలో నాతవరం మండలంలోని ఎర్ర‌వ‌రం జంక్ష‌న్ వ‌ద్ద జ‌రిగే వేడుక‌ల్లో జాతీయ ప‌తాకాన్నిప్ర‌తిప‌క్ష నేత ఆవిష్క‌రిస్తార‌ని తెలిపారు. రాష్ట్ర ప్ర‌జ‌లంద‌రూ, విశాఖ జిల్లా వాసులంతా స్వాతంత్ర దినోత్స‌వాన్ని ఘ‌నంగా నిర్వ‌హించుకునేందుకు వీలుగా బుధ‌వారం పాద‌యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించార‌ని పేర్కొన్నారు. తిరిగి గురువారం ఉద‌యం నుంచి వైయ‌స్ జ‌గ‌న్ పాద‌యాత్ర య‌థావిథిగా కొన‌సాగుతుంద‌ని త‌ల‌శీల ర‌ఘురాం వివ‌రించారు. 
Back to Top