బ్రాహ్మణుల‌ స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి కృషి


ప్ర‌కాశం: బ‌్రాహ్మ‌ణులు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించేందుకు కృషి చేస్తాన‌ని వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి హామీ ఇచ్చారు. ప్రజాసంకల్పయాత్రలో భాగంగా శుక్ర‌వారం  బ్రాహ్మణ సంఘ పెద్దలు వైయ‌స్ జ‌గ‌న్‌ను కలిసి తమ సమస్యలను వివరించారు. బ్రాహ్మణ కార్పొరేషన్‌ నిధులు దుర్వినియోగం అవుతున్నాయంటూ ఆవేదన వ్యక్తం చేశారు. వారి సమస్యలను విన్న వైయ‌స్‌ జగన్ సానుకూలంగా స్పందించారు.
Back to Top