నా బిడ్డను ఆశీర్వదించండి

నా బిడ్డను ఆశీర్వదించండి 
 వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ గౌర‌వ అధ్య‌క్షురాలు వైయ‌స్‌ విజ‌య‌మ్మ 

వైయ‌స్ఆర్ జిల్లా: ‘‘రాష్ట్రంలో ప్రస్తుతం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను స్వయంగా తెలుసుకునేందుకే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్ర‌జా సంక‌ల్పం పేరుతో పాదయాత్ర చేపడుతున్నాడు. నా బిడ్డను ఆదరించి.. ఆశీర్వదించండి’’ అని వైయ‌స్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ గౌరవ అధ్యక్షురాలు వైయ‌స్‌ విజయమ్మ కోరారు. వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం నుంచి సుదీర్ఘ పాదయాత్రకు శ్రీకారం చుట్టనున్న నేపథ్యంలో వైయ‌స్ఆర్ జిల్లా పులివెందులలో వైయ‌స్‌ విజయమ్మ మీడియాతో ఎదుట వైయ‌స్ జ‌గ‌న్  పాదయాత్ర గురించి ఆమె ఎంతో భావోద్వేగానికి గుర‌య్యారు. 

 వైయ‌స్ జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నా.. 
‘‘దివంగత ముఖ్య‌మంత్రి వైయ‌స్ రాజశేఖరరెడ్డి చేసిన పాదయాత్ర చూశా... షర్మిలమ్మ చేపట్టిన పాదయాత్ర చూశా... వారిని ప్రజలు ఆదరించి అక్కున చేర్చుకున్నార‌ని వైయ‌స్ విజ‌య‌మ్మ పేర్కొన్నారు. ఇప్పుడు ప్రజల పక్షాన వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పోరాటం చేస్తున్నాడ‌ని,  వారి సమస్యలను మరింత లోతుగా అర్థం చేసుకోవడానికి ఆయనే స్వయంగా ప్రజల్లోకి వస్తున్నార‌న్నారు. పాదయాత్ర చేయడం ఎంతో కష్టంతో కూడుకున్న పని. నేను మొదట చెప్పినట్లుగా వైయ‌స్ జగన్‌ను మీ చేతుల్లో పెడుతున్నాన‌ని వెల్ల‌డించారు. ప్రజల కోసమే వైయ‌స్ జగన్‌ ‘ప్రజాసంకల్పం’ పాదయాత్ర తలపెట్టాడ‌ని తెలిపారు. ఇప్పటికే రాష్ట్ర ప్రజానీకం సంక్షేమ కోసం నవరత్నాలను ప్రకటించాడ‌ని గుర్తు చేశారు.   

ఒక్క‌సారి అవ‌కాశం ఇచ్చి చూడండి..
వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డిని మీ కుమారుడిగా, సోదరుడిగా, మనవడిగా  అక్కున చేర్చుకుని ఆశీర్వదించాల‌ని వైయ‌స్ విజ‌య‌మ్మ కోరారు.  ఒక్కసారి అవకాశం ఇచ్చి చూడండి. తండ్రిలాంటి పాలన అందిస్తాడ‌ని హామీ ఇచ్చారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా సీఎం చంద్రబాబు  అమలు చేయలేదు. దీన్ని ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. వైయ‌స్ జగన్‌ తలపెట్టిన పాదయాత్రను చూసి చంద్రబాబు భయప డుతున్నార‌ని చెప్పారు.  చంద్రబాబు గతంలో పాదయాత్ర చేసినప్పుడు ఏం అనుమతులు తీసుకున్నారు? గతంలో వైయ‌స్‌ రాజశేఖరరెడ్డి, షర్మిల పాదయాత్ర చేశారు. స్వాతంత్య్రం రాక ముందు మహాత్మాగాంధీ, వినోబా భావే పాదయాత్రలు చేశారు. నిరసన తెలపడం ప్రతిపక్షం బాధ్యత అని గుర్తు చేశారు. ప్రభుత్వం ఇప్పటికైనా కళ్లు తెరిచి, ప్రజలకు మంచి పనులు చేయాల‌ని విజ‌య‌మ్మ సూచించారు. ఇచ్చిన హామీల్లో కొన్నింటినైనా నెరవేర్చాల‌ని ఆమె డిమాండ్ చేశారు.  పాదయాత్రలోనే సంక్షేమ పథకాల బ్లూప్రింట్‌ను తయారు చేసుకున్నారు. మ‌హానేత వైయ‌స్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి అమలు చేసిన ప్రతి సంక్షేమ పథకమూ పాదయాత్ర నుంచి పుట్టిందే అని చెప్పారు.  
Back to Top