రుణమాఫీ పేరుతో మోసం


గుంటూరు: ఎన్నికల సమయంలో చంద్రబాబు చేనేతలకు సొసైటీల ద్వారా రుణాలు మాఫీ చేస్తామని ఇచ్చిన హామీని నెరవేర్చలేదని రాష్ట్ర చేనేత విభాగం కన్వీనర్‌ బీరక సురేందర్‌ విమర్శించారు. మంగళగిరిలో ఏర్పాటు చేసిన చేనేతల ఆత్మీయ సమ్మేళనంలో ఆయన మాట్లాడారు. రుణమాఫీ పేరుతో చంద్రబాబు మోసం చేశారని ఆయన మండిపడ్డారు. చేనేతలకు కేటాయించిన నిధులు కూడా ఖర్చు చేయలేదన్నారు. చేనేతలకు చంద్రబాబు 25 రకాల హామీలు ఇచ్చారని, ఇందులో ఏ ఒక్కటి నెరవేర ్చలేదన్నారు. చేనేత వ్యవస్థను నిర్వీర్యం చేయాలనే ప్రయత్నం చేస్తున్నార ని ఆగ్రహం వ్యక్తం చేశారు. 
 

తాజా వీడియోలు

Back to Top