సరైన పరిహారం ఇప్పించాలయ్యా...

వైయస్‌ జగన్‌ను కలిసిన భవనపాడు పోర్టు నిర్వాసితులు..
శ్రీకాకుళంఃప్రజా సంకల్పయాత్రలో భవనపాడు పోర్టు నిర్వాసితులు కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.తమకు సరైన పరిహారం ఇప్పించాలని జననేతను కోరారు.నిర్వాసితుల సమస్యలపై వైయస్‌ జగన్‌ సానుకూలంగా స్పందించారు.త్వరలో నిర్మించబోయే భవనపాడు పోర్టు వలన సర్వసం కోల్పోతున్నామని  మూడు గ్రామాల ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే ప్యాకేజీ వలన తమకు ఎలాంటి ఉపయోగం లేదన్నారు.ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తామనేది ప్రభుత్వం ఇప్పటి వరుకూ స్పష్టత ఇవ్వలేదన్నారు. వైయస్‌ జగనే మమల్ని ఆదుకోవాలని మొరపెట్టుకున్నారు.ప్రతి కుటుంబంలో ఒకరి ఉద్యోగం కల్పించాలని కోరారు.ఎకరానికి రూ.35 లక్షలు ఇవ్వాలని వినతించారు.ప్రతి కుటుంబసభ్యులకు నెలకు 10వేలు పెన్షన్‌ ఇవ్వాలని కోరారు.నాణ్యమైన డబుల్‌ బెడ్‌రూం ఇల్లు కట్టించి ఇవ్వాలని వైయస్‌ జగన్‌ను కోరారు.

 

తాజా వీడియోలు

Back to Top