బద్వేల్‌ సమస్యలన్నీ పరిష్కరిస్తా: వైయస్‌ జగన్‌

జొన్నవరం: బద్వేల్‌ నియోజకవర్గంలోని ప్రధానమైన మూడు సమస్యలను పరిష్కరిస్తానని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత, ప్రతిపక్షనేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. ప్రజా సంకల్పయాత్రలో బద్వేల్‌ నియోజకవర్గ వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ బూత్‌ కమిటీ కన్వీనర్‌లు, సభ్యులు పాల్గొన్నారు. ఈ సందర్భం వారు మైలవరం నుంచి రాయలసీమకు థర్మల్‌ పవర్‌ ప్లాంట్‌కు నీరు, వంద కోట్లతో నియోజకవర్గ అభివృద్ధితో పాటు పలు సమస్యలపై వైయస్‌ జగన్‌కు వినతిపత్రం అందజేశారు. అనంతరం వైయస్‌ జగన్‌ మాట్లాడుతూ.. కడప జిల్లాలో చివరి రోజు పాదయాత్రకు వచ్చిన బద్వేల్‌ నియోజకవర్గానికి చెందిన ప్రతి బూత్‌ కమిటీ కన్వీనర్‌లకు, సభ్యులు కృతజ్ఞతలు తెలియజేశారు. మున్ముందు ఇంకా బాగా పనిచేయాలని సూచించారు. వినతిపత్రంలో పేర్కొన్న సమస్యలన్నీ పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. పాదయాత్ర ముగిసిన తరువాత మళ్లీ బస్సు యాత్ర చేపడతానని, ఆ యాత్రలో ప్రతి అసెంబ్లీకి మూడు, నాలుగు మేజర్‌ సమస్యలపై అసెంబ్లీ మ్యానిఫెస్టో విడుదల చేస్తామన్నారు. మన ప్రభుత్వం రాగానే అవి కచ్చితంగా పూర్తి చేసి తీరుతామని స్పష్టం చేశారు. 

Back to Top