<br/><strong>వైయస్ జగన్‌ను కలిసిన నిరుద్యోగ యువత</strong><br/><strong>శ్రీకాకుళం:</strong> బాబు వస్తే జాబు వస్తుందనేది భ్రమ అని శ్రీకాకుళం నిరుద్యోగ యువత మండిపడ్డారు. ప్రజా సంకల్పయాత్రలో పాల్గొన్న నిరుద్యోగులు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు. నాలుగున్నరేళ్లుగా చంద్రబాబు ప్రభుత్వం ఎలాంటి ఉపాధి కల్పించలేదని వాపోయారు. నిరుద్యోగ మహిళ మీడియాతో మాట్లాడుతూ.. ఉన్నత చదువులు చదివి సర్టిఫికెట్లు బీరువాల్లో దాచుకుంటున్నామని, వాటి వల్ల ఎలాంటి ఉపయోగం లేకుండా పోయిందన్నారు. చంద్రబాబు ఇంటికో ఉద్యోగం అన్న మాట బూటకమన్నారు. ప్రైవేట్ సెక్టార్లలో ఉపాధి కల్పిస్తామని అది కూడా నెరవేర్చలేదన్నారు. వైయస్‌ఆర్ ప్రభుత్వం వస్తే ప్రతి నిరుద్యోగికి ఉపాధి కల్పిస్తారనే ధైర్యంతో ఉన్నామన్నారు.