ప్రభుత్వ వేధింపుల నుంచి రక్షించండి

చిత్తూరు:

ప్రభుత్వం, అధికారుల వేధింపుల నుంచి మమ్మల్ని రక్షించాలని వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని ఆటోడ్రైవర్లు కలిసి ఆవేదన వ్యక్తం చేశారు. పానగల్‌లో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో ఆటోడ్రైవర్‌లు పాల్గొని వైయస్‌ జగన్‌కు తమ సమస్యను చెప్పుకున్నారు. ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల పేరుతో ప్రభుత్వం వేధింపులకు దిగుతుందని చెప్పుకున్నారు. అన్ని పత్రాలు సరిగ్గా ఉన్నా చలానాలు విధిస్తున్నారని, మేం ఎలా బతకాలని.. ప్రభుత్వం వేధింపుల నుంచి రక్షించాలని కోరారు. 

Back to Top