రెడ్డి పాలెం వద్ద జననేతను కలుసుకున్న ఆశా వర్కర్లు

ప్రజా సంకల్పయాత్ర
చేస్తున్న వైయస్ జగన్ మోహన్ రెడ్డిని గుడివాడ నియోజకవర్గం రెడ్డి పాలెం వద్ద ఆశా
వర్కర్లు కలుసుకుని తమ సమస్యలను వివరించారు. సమాన పనికి సమాన వేతనం లభించేలా చూడాలని
వారు విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 40 వేల మంది ఆశా వర్కర్ల సమస్యలపై
రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్యం ప్రదర్సిస్తోందని వారు వాపోయారు. దివంగత వైయస్
రాజశేఖరరెడ్డి హయాంలో నియమితులైన తమను ఆయన మరణం తరువాత పట్టించుకునే వారే
కరువయ్యారని ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం వేతనం కూడా ఇవ్వకుండా, వెట్టి చాకిరీ
చేయించుకుంటున్నారని, రాత్రనక, పగలనక సేవలు అందిస్తున్నా తమను గుర్తిస్తున్న వారే
లేరని, మహానేత వైయస్ ఆర్ ఉండి ఉంటే తమకు గౌరవప్రదమైన వేతనం లభించి ఉండేదని వారు ఈ సందర్భంగా
అన్నారు. తెలుగుదేశం తమను నిర్లక్ష్యం చేస్తోందని, తమకు న్యాయం చేయాలని జననేతకు విజ్ఞప్తి
చేశారు. వారి సమస్యలను విన్న పరిష్కారానికి భరోసా ఇచ్చారు.

Back to Top