<strong>శ్రీకాకుళంః</strong> పాలకొండ మండలం అన్నవరం గ్రామానికి చెందిన రైతులు వైయస్ జగన్‌ను కలిసి తమ సమస్యలు చెప్పుకున్నారు.తమ గ్రామానికి నాగావళి మీద కరకట్ట లేదని, ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామన్నారు.ౖ వెయస్‌ఆర్ హయాంలో కొంత నిర్మాణం జరిగిందని ఆ తర్వాత ఎవరూ పట్టించుకోలేదన్నారు.వేల ఎకరాల భూమి ముంపునకు గురవుతుంది. కరకట్ట పూర్తయితే 10వేల ఎకరాలు ముంపును గురవకుండా ఉంటుందన్నారు.కలెక్టర్,ప్రజాప్రతినిధులను విన్నవించిన పట్టించుకోలేదన్నారు..నిధులు లేవని చెబుతున్నారని తెలిపారు. వెయస్ జగన్ సానుకూలంగా స్పందించి తప్పనిసరిగా పూర్తి చేస్తామని భరోసా ఇచ్చారన్నారు