జననేతను కలిసిన ఏఎన్‌ఎంలు

తూర్పుగోదావరి: సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని కోరుతూ సెకండ్‌ ఏఎన్‌ఎంలు వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసి కోరారు. ఈ మేరకు తమ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. రాజోలు నియోజకవర్గంలో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో సెకండ్‌ ఏఎన్‌ఎంలు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిశారు. ఈ మేరకు 2008లో దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో విధుల్లో చేరామన్నారు. ఇప్పుడిస్తున్న వేతనాలు సరిపోవడం లేదని, ఫస్ట్‌ ఏఎన్‌ఎంలతో సమానంగా పనిచేస్తున్నామని, మమ్మల్ని కూడా రెగ్యులరైజ్‌ చేయాలని కోరారు. అదే విధంగా టీఏ, డీఏ, యూనిఫాం అలవెన్స్‌లు కూడా అందడం లేదన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే సమాన పనికి సమాన వేతనం కల్పిస్తామని వైయస్‌ జగన్‌ భరోసా ఇచ్చారన్నారు. 
 
Back to Top