వైయస్ జగన్ కలుసుకున్న ఆదర్శ రైతులు

కదిరి:  ప్రజా సంకల్పయాత్ర చేస్తున్న ప్రతిపక్ష నాయకులు వైయస్ జగన్ మోహన్ రెడ్డిని కదిరి లో ఆదర్శ రైతులు కలుసుకున్నారు. చంద్రబాబు ప్రభుత్వం తమను ఏవిధంగా మోసం చేసి , వీధుల పాలు చేసిందో వారు ఈ సందర్బంగా వివరించారు. బాబు వస్తే జాబు వస్తుందని ఊదరగొట్టారనీ. అధికారంలోకి రాగానే మా ఉద్యోగాలను ఊడపెరికారన్నారు . రైతులు నష్టపోతున్నారు, ఫీల్డ్ అసిస్టెంట్లను కూడా రోడ్డున పడేశారని వారు జగన్ తో వాపోయారు. ఉన్న ఉద్యోగాలన్నీ పోయాయన్నారు.  పంటల గురించి అవగాహన కల్లించేవారు కరువయ్యారన్నారు. వీరి సమస్యలను విన్న జగన్ మోహన్ రెడ్డి ఆదుకుంటామన్న భరోసా ఇచ్చారు.

Back to Top