ప్రారంభ‌మైన 92వ రోజు ప్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌


ఒంగోలు: ప‌్ర‌జా సంక‌ల్ప‌యాత్ర‌లో భాగంగా  వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్య‌క్షులు వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి చేప‌ట్టిన పాద‌యాత్ర నేటికి 92వ రోజుకు చేరుకుంది. ఈ రోజు వైయ‌స్ జ‌గ‌న్ కందుకూరు శివారు నుంచి త‌న పాద‌యాత్ర‌ను ప్రారంభించారు. వెంక‌టాద్రిపాలెం, అనంత‌సాగ‌రం క్రాస్‌రోడ్డు, యెద్లూరుపాడు, యెద్లూరుకాల‌నీ, పెద్ద వెంక‌న్న‌పాలెం మీదుగా విప్ప‌గుంట వ‌ర‌కు పాద‌యాత్ర చేయ‌నున్నారు. కాగా జ‌న‌నేత వైయ‌స్ జ‌గ‌న్ చేస్తున్న పాద‌యాత్ర‌కు ప్ర‌జ‌లు బ్ర‌హ్మ‌ర‌థం ప‌డుతున్నారు. వేలాదిగా వైయ‌స్ జ‌గ‌న్ వెంట న‌డుస్తున్నారు. 
Back to Top