కొనసాగుతున్న 45వ రోజు ప్రజా సంకల్ప యాత్ర

అనంతపురం: వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రజా సంకల్ప యాత్ర 45వ రోజు పాదయాత్ర అనంతపురం జిల్లాలో కొనసాగుతోంది. బుధవారం ఉదయం కదిరి నియోజకవర్గంలోని నంబుల పులకుంట మండల కేంద్రం నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి దిగువ తువ్వపల్లి క్రాస్, కొత్తపల్లి క్రాస్, మల్లెంవారిపల్లి మీదుగా పాపన్నగారిపల్లికి చేరుకున్నారు. మధ్యాహ్నం 12.30 గంటలకు భోజన విరామం తీసుకున్నారు.  అనంతరం పాదయాత్ర పెడబల్లి మీదుగా ప్రారంభమైంది. 
 
Back to Top