మహిళా లోకానికి బాబు అన్యాయం చేశారు

కృష్ణ:

నాలుగు సంవత్సరాల నుంచి చంద్రబాబు మహిళా లోకానికి అన్యాయం చేశారని దళిత మహిళా సంఘం రాష్ట్ర అధ్యక్షురాలు అనూషరాణి మండిపడ్డారు. కైకలూరులో కొనసాగుతున్న ప్రజా సంకల్పయాత్రలో మండవల్లి వద్ద ఆమె వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె పలు సమస్యలపై జననేతకు వినతిపత్రం అందజేశారు. మద్యం షాపులు ఎత్తివేస్తామని, చంద్రబాబు గల్లీకొకటి పెట్టారని, మహిళల రక్షణ కోసం ప్రత్యేక పోలీస్‌ స్టేషన్‌లు పెడతామని చెప్పి అది కూడా నెరవేర్చలేదన్నారు. రాష్ట్రంలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని కోరామన్నారు. అదే విధంగా హిందూకోడ్‌ బిల్లును అమలు చేయాలని జననేతకు వినతిపత్రం అందజేశామన్నారు.

Back to Top