జొన్నగిరికి చేరుకున్న వైయస్‌ జగన్‌

కర్నూలు:

వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధినేత వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజా సంకల్పయాత్ర కర్నూలు జిల్లా జొన్నగిరికి చేరుకుంది. వైయస్‌ జగన్‌ను కలుసుకుని బాధలు చెప్పుకునేందుకు ప్రజలు తండోపతండాలుగా తరలివచ్చారు. జననేతకు పూలవర్షంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా వైయస్‌ జగన్‌ ప్రజలకు అభివాదం చేసుకుంటూ వారి కష్టాలను వింటూ ముందుకు వెళ్తున్నారు. కాగా కర్నూలు జిల్లాలో ఆఖరి రోజు యాత్ర జోరుగా సాగుతుంది.

Back to Top