కొండకర్ల​ క్రాస్‌ నుంచి 248వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

  
విశాఖ‌ : ప్రజలతో మమేకమై వారి సమస్యలు తెలుసుకుని.. వారిలో భరోసా నింపేందుకు వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర విశాఖపట్నం జిల్లాలో దిగ్విజయంగా కొనసాగుతోంది. జననేత 248వ రోజు పాదయాత్రను మంగళవారం ఉదయం యలమంచిలి నియోజకవర్గంలోని కొండకర్ల​ క్రాస్‌ నుంచి ప్రారంభించారు. అక్కడ నుంచి కొండకర్ల జంక్షన్‌, హరిపాలెం జంక్షన్‌, తిమ్మరాజు పేట, పెద్దపాడు క్రాస్‌ మీదుగా మునగపాక రోడ్డు (బ్రిక్‌ యూనిట్‌) వరకు వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. 

Back to Top