కత్తిపూడి నుంచి 230వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 

 తూర్పుగోదావరి  : ప్రజాసంకల్పయాత్రలో భాగంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర 230వ రోజు సోమవారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా కత్తిపూడి శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి నెల్లిపూడి, శ్రీశాంతి ఆశ్రమం క్రాస్‌ మీదుగా శంఖవరం వరకు పాదయాత్ర కొనసాగనుంది. రాత్రికి జననేత అక్కడే బస చేస్తారు. కాగా, వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర సాగుతున్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారిపొడవునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర సాగిస్తున్నారు. ఇప్పటి వరకు ఆయన 2656.1 కిలోమీటర్లు నడిచారు. మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన రావు జయంతి సందర్భంగా కత్తిపూడిలో ఆయన చిత్రపటానికి పూలమాలవేసి  వైఎస్‌ జగన్ నివాళులర్పించారు. కార్యక్రమంలో‌ జక్కంపూడి రాజా, కురసాల కన్నబాబు తదితరులు పాల్గొన్నారు.

 


Back to Top