కొవ్వూరు బైపాస్ నుంచి 187వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

 
 పశ్చిమ గోదావరి :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి 187వ రోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభమైంది. మంగళవారం ఉదయం విజయ​విహార్‌ కొవ్వూరు బైపాస్‌ సర్కిల్‌ నుంచి వైయ‌స్‌ జగన్‌ పాదయాత్ర ప్రారంభించారు. బ్రిడ్జి పేట, శ్రీనివాసపురం మీదుగా నేడు పాదయాత్ర కొనసాగనుంది. శ్రీనివాసపురం చేరుకున్నాక అక్కడ వైయ‌స్‌ జగన్‌ లంచ్‌ విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం రాజమండ్రి రైలు కమ్‌ రోడ్‌ బ్రిడ్జి చేరుకోవడంతో వైయ‌స్‌ జగన్‌ తూర్పుగోదావరి జిల్లాలోకి ప్రవేశిస్తారు. రాజమండ్రి కోటిపల్లి బస్టాండ్‌ చేరుకున్నాక అక్కడ భారీ బహిరంగసభలో  జ‌న‌నేత‌ ప్రసంగిస్తారు. రైల్వేస్టేషన్‌ చేరుకున్నాక పాదయాత్ర ముగుస్తుంది. 

Back to Top