17న వైయ‌స్ఆర్‌సీపీ నేతల భేటీ

అమరావతి: ప్రతిపక్ష నేత వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్రపై చర్చించడానికి 17న నెల్లూరులో పార్టీ నేతలు సమావేశం కానున్నారు. నెల్లూరు పార్లమెంటరీ జిల్లా పార్టీ అధ్యక్షుడు కాకాణి గోవర్ధన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే సమావేశంలో జిల్లాలో వైయ‌స్ జగన్‌ పాదయాత్ర మార్గాన్ని ఖరారు చేస్తారు. వైయ‌స్ జగన్‌ రాజకీయ కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఈ సమావేశానికి హాజరై జిల్లాలో పాదయాత్ర పూర్తయ్యే వరకూ తీసుకోవాల్సిన చర్యలపై  సూచనలు చేస్తారు. మొత్తం పది నియోజకవర్గాలకు గాను 9 నియోజకవర్గాల్లో యాత్ర సాగే అవకాశం ఉందని పార్టీ నేతలంటున్నారు. 21 తర్వాత ఒకట్రెండు రోజుల్లో ఎప్పుడైనా జిల్లా సరిహద్దుల్లోకి ప్రవేశించవచ్చని పార్టీ వర్గాలు తెలిపాయి.

 

తాజా ఫోటోలు

Back to Top