తాడేపల్లిగూడెం నుంచి 168వరోజు ప్రజాసంకల్పయాత్ర ప్రారంభం

  ప‌శ్చిమ గోదావ‌రి:  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 168వ రోజుకు చేరుకుంది. ప‌శ్చిమ గోదావ‌రి జిల్లాలో మంగళవారం ఉదయం తాడేపల్లిగూడెం మార్కెట్‌ నుంచి వైయ‌స్ జ‌గ‌న్ త‌న‌ పాదయాత్ర ప్రారంభించారు.  అనంతరం పెంటపాడు, బోడపాడు క్రాస్‌ మీదుగా ముదునూరు చేరుకొని భోజన విరామం తీసుకుంటారు.  మధ్యాహ్నం 2.45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి కాశిపాడు క్రాస్‌, చిలకం పాడు, వీరేశ్వరపురం క్రాస్‌ మీదుగా పిప్పర వరకూ పాదయాత్ర కొనసాగిస్తారు.  

Back to Top