167వరోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా :  వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేస్తున్న ప్రజాసంకల్పయాత్ర 167వ రోజు షెడ్యూల్ విడుద‌లైంది. వైయ‌స్ఆర్‌ కాం‍గ్రెస్‌ పార్టీ రాజకీయ వ్యవహారాల మండలి సభ్యుడు డీఏ సోమయాజులు అకాల మ‌ర‌ణం చెంద‌డంతో  ఆదివారం పాద‌యాత్ర‌కు విరామం ప్ర‌క‌టించిన వైయ‌స్ జ‌గ‌న్ హైద‌రాబాద్ వెళ్లి ఆయ‌న భౌతిక‌కాయానికి నివాళుల‌ర్పించారు. సోమ‌వారం నుంచి ప్ర‌జాసంక‌ల్ప యాత్ర య‌థావిధంగా కొన‌సాగుతోంది. ఉదయం వెంకటరామన్న గూడెం శివారు నుంచి వైయ‌స్ జ‌గ‌న్ త‌న పాదయాత్ర ప్రారంభిస్తారు.  వెల్లమిల్లి మీదుగా పెద్ద తాడేపల్లి చేరుకొని విరామం తీసుకుంటారు. అనంతరం మధ్యాహ్నం 2.45కి పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడ నుంచి తాడేపల్లిగూడెం మార్కెట్‌ ప్లేస్‌ చేరుకొని బహిరంగ సభలో ప్రసంగిస్తారు.  
Back to Top