139వ రోజు ప్రజాసంకల్పయాత్ర షెడ్యూల్

 విజయవాడ : వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయ‌స్ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్రకు కృష్ణా జిల్లా ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోంది. వేలాది మంది ప్రజలు, పార్టీ నేతలు, కార్యకర్తలు రాజన్న బిడ్డతో కలిసి అడుగులేస్తున్నారు. 139వ రోజు పాదయాత్ర షెడ్యూల్‌ను విడుదలైంది. మైలవరం నుంచి వైయ‌స్‌ జగన్‌ బుధవారం పాదయాత్ర ప్రారంభిస్తారు. చిన్న నందిగామ క్రాస్‌, వెల్వదం, గణపవరం అడ్డా క్రాస్‌ మీదుగా గణపవరం చేరుకుంటారు. అనంతరం భోజన విరామం తీసుకుంటారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2.45 గంటలకు పాదయాత్ర తిరిగి ప్రారంభమౌతుంది. అక్కడి నుంచి ప్రజలను సమస్యలను తెలసుకుంటూ వైయ‌స్‌ జగన్‌ ముందుకు సాగనున్నారు. అగిరిపల్లి క్రాస్‌ మీదుగా శోభనపురం క్రాస్‌ వరకు పాదయాత్ర సాగుతుంది. 

Back to Top