జననేతను కలిసి 108, 104 ఉద్యోగులు

విశాఖపట్నం: చంద్రబాబు పాలనలో ఇబ్బందులు పడుతున్నామని 108, 104 ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేశారు. నర్సీపట్నం నియోజకవర్గంలో పెద్దబొడ్డేపల్లి వద్ద వైయస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు వైయస్‌ జగన్‌మోహన్‌రెడ్డిని కలిసిన ఉద్యోగులు వారి సమస్యలపై వినతిపత్రం అందజేశారు. దివంగత మహానేత వైయస్‌ రాజశేఖరరెడ్డి హయాంలో తమకు మేలు జరిగిందని, చంద్రబాబు వచ్చాక కష్టాలు పడుతున్నామన్నారు. అదే విధంగా సీపీఎస్‌ విధానంపై వైయస్‌ జగన్‌ ఇచ్చిన హామీపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేశారు. సీపీఎస్‌ రద్దు చేస్తామని ప్రకటించడంతో ఉద్యోగులంతా జననేతను కలిసి కృతజ్ఞతలు తెలిపారు. 
Back to Top