మళ్లీ రాజన్న రాజ్యం రావాలి

వైయస్సార్సీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన గడపగడపకూ వైయస్సార్ కాంగ్రెస్ కార్యక్రమం రాష్ట్రవ్యాప్తంగా విజయవంతంగా కొనసాగుతోంది. వైయస్సార్సీపీ శ్రేణులు ఇంటింటికి వెళ్లి స్వయంగా ప్రజల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు. రెండేళ్లుగా పింఛన్లు రాక, రేషన్ అందక, రుణాలు మాఫీ గాక, కొత్త రుణాలు రాక, ఉద్యోగాలు లేక తీవ్ర అవస్థలు పడుతున్న విషయాన్ని ప్రజలు వైయస్సార్సీపీ నేతల దృష్టికి తీసుకొచ్చారు. బాబుకు ఓట్లేసి మోసపోయామని ఆవేదన వ్యక్తం చేశారు. మన నాయకులు వైయస్ జగన్ ను సీఎం చేసుకొని మళ్లీ రాజన్న రాజ్యం తెచ్చుకుందామని నేతలు ప్రజల్లో భరోసా కల్పించారు. 

పాణ్యం ఎమ్మెల్యే గౌరు చరితారెడ్డి కల్లూరు చెంచు నగర్ లో గడపగడపలో పర్యటించారు. మరోవైపు, పత్తికొండ  నియోజకవర్గ సమన్వయకర్త సి.హెచ్. నారాయణరెడ్డి ప్రతీ గడపకు వెళ్లి బాబు మోసాలను ఎండగట్టారు.  ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ నెల్లూరులోని 42వ డివిజన్ లో ప్రతీ గడపలో పర్యటించారు. ఎన్నికల హామీల అమలుకు సంబంధించి ప్రజలకు కరపత్రాలు పంపిణీ చేసి సమాధానాలు రాబట్టారు. అబద్ధపు హామీలిచ్చి మోసం చేసిన చంద్రబాబుకు ప్రజలు ఒక్క మార్కు కూడా వేయలేదు. 

Back to Top